పద్మశాలిల ఆధ్వర్యంలో వైభవంగా సామూహిక కుంకుమార్చనలు
చార్మినార్ ఎక్స్ ప్రెస్: సెప్టెంబర్ 16, పెద్ద శంకరంపేట.
పెద్ద శంకరంపేట పట్టణంలో శ్రీ భక్త మార్కండేయ మందిరంలో పద్మశాలిల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. పురోహితుడు రాయలగారి అభిలాష్ ఆధ్వర్యంలో కుంకుమార్చనలు వేద బ్రాహ్మణ మంత్రోచ్ఛారణలతో గణపతి పారాయణం, గాయత్రి మంత్రం జపిస్తూ మహిళలు పెద్ద ఎత్తున సామూహిక కుంకుమార్చన లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పద్మశాలి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.