పటాన్చెరులో వైభవంగా శ్రీకృష్ణుడి రథయాత్ర

పటాన్చెరులో వైభవంగా శ్రీకృష్ణుడి రథయాత్ర

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 28, ఆగస్ట్

పటాన్చెరులో జలగరి ఎట్టయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు, ఎట్టయ్య కుమారుడు దేవా కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన రథయాత్ర తో పటాన్చెరులో వీధులన్నీ శోభాయమానంగా మారాయి, తీరొక్క విద్యుత్ దీపాలతో కళాకారుల ఆటపాటలతో సాంప్రదాయ నృత్యాలు, డప్పు సప్పులతో దేవతామూర్తుల వేషధారణలో కళాకారులు చేసిన నృత్యాలతో శ్రీకృష్ణ రథయాత్ర వైభవంగా ముందుకు సాగింది.

ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, గత 15 సంవత్సరాలుగా ఎట్టయ్య గారి ఆధ్వర్యంలో రథయాత్ర జరుగుతుందని వారి కుటుంబంపై శ్రీకృష్ణుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలపై కూడా ఉండాలని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన హైడ్రా చెరువులు కుంటలు కబ్జాలపై కొరడా జూడిపిస్తుందని ఐడ్రాకు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని నీలం మధు ముదిరాజ్ అన్నారు ,పటాన్చెరువు కు చెందిన పుర ప్రముఖులు అందరూ హాజరై ఈ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment