సారు ఇటు చూడు మురికి నీళ్లు కాలనీలోకి…..
చార్మినార్ ఎక్స్ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11 ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని కెసిఆర్ కాలనీలో మురికి నీళ్లు లీకేజీ అయ్యి కాలనీ లోకి వస్తున్నాయి ప్రజలకు దోమల బెడదతో రోగాల బారిన పడుతున్న కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్గంధం వెదజల్లినప్పుడల్లా మీమే మురికి కాలువలను శుభ్రం చేసుకుంటున్నామని స్థానికులు తెలిపారు.దుర్గంధంతో ముక్కు మూసుకొని జీవనం సాగిస్తున్నామని వాపోతున్నారు. దోమల బెడదతో రోగాల బారిన పడుతున్న కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్గంధం వెదజల్లినప్పుడల్లా మీమే మురికి కాలువలను శుభ్రం చేసుకుంటున్నామని స్థానికులు తెలిపారు. మురికి కాలువ నీరు వెళ్ళేందుకు సీసీ రోడ్ మధ్యలో కనీసం కాలువ నిర్మాణం చేయకుండా అలాగే ఉంచడంతో పాటు మూడు సంవత్సరాల నుండి మురికి కాలువలను శుభ్రం చేయకపోవడం తో మురికి నీరు నిల్వ ఉండటం వల్ల దుర్గంధం వెదజల్లుతూ, దోమలకు ఆవాసంగా ఉన్నదని తెలిపారు. కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మురికి కాలువలను శుభ్రం చేసి, మురుగు నీరు నిల్వ ఉంచకుండా, పైప్ ను తొలగించి, మురికి కాలువ నిర్మాణం చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.