రుణమాఫీ కానీ రైతులు గ్రామాల్లో అందుబాటులో ఉండాలి
..రేషన్ కార్డు లేని రైతుల.
..కుటుంబ సభ్యుల నిర్ధారణ
ఏవో శ్వేతా కుమారి
మెదక్ జిల్లా కుల్చారం మండలం లోని రైతులకు రైతు రుణమాఫీ లో భాగంగా28/08/2024నుండి 06/09/2024 వరకు ప్రతి గ్రామంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారని రైతులు తమ కుటుంబ సభ్యుల నిర్ధారణ(రేషన్ కార్డు లేని రైతుల )కోసం మీ మండల వ్యవసాయ అధికారి (ఏ ఓ ) మరియు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏ ఈ ఓ) మీ గ్రామానికి వస్తారు లిస్ట్ లో పేర్లు ఉన్న రైతుల కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం వేచి ఉన్న రైతులు మీ గ్రామం లో మీ కుటుంబ సభ్యుల తో వేచి ఉండగలరు మీ గ్రామానికి అధికారులు ఏప్పుడు వస్తారు అనేది వ్యవసాయ విస్తరణ అధికారి మీ గ్రామానికి అధికారులు వచ్చే, ఒక రోజు ముందుగానే తెలియచేస్తారు కావున దీని కోసం మండల వ్యవసాయ ఆఫీసు కి కానీ సంబంధించిన రైతు వేదిక కి కానీ వెళ్ళవలసిన అవసరం లేదు అని దీని కోసం కావలిసినవి పత్రాలను అధికారికి చూపించవలసిన అవసరం ఉంటుందని ఏవో శ్వేత కుమారి తెలిపారు
1.పంటల లోన్ (crop loan) ఉన్న రైతుల ఆధార్ కార్డు
2. కుటుంబ సభ్యులు ఆధార్ కార్డు,
3 అప్లికేషన్ ఫారం
4 కుటుంబ సభ్యులు గ్రామాల్లో ఉండాలి
పైన తెలిపిన ఆధారాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలి తెలిపారు