అనాథలకు,అభాగ్యులకు అండగా నిలబడదాం
మానసిక రోగులకు పునర్జన్మ ఇవ్వడం అభినందనీయం.
మాతృదేవోభవ ఆనాధశ్రమ సేవలు ప్రశంసనీయం.
నీలం మధు ముదిరాజ్..
ఆశ్రమ నిర్వాకులను శాలువాతో సత్కరించి అభినందించిన నీలం మధు.
ఆనాథలకు, అభాగ్యులకు, మానసిక రోగులకు అండగా నిలబడి సంపూర్ణ సహకారం అందిద్దామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల పరిధిలోని నాదర్ గుల్ గ్రామ పరిధిలో గట్టు గిరి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాతృదేవోభవ ఆనాథశ్రమంలో మానసిక రోగికి పునర్జన్మ ఇచ్చి ఆశ్రయం కల్పించే కార్యక్రమంలో నీలం మధు పాల్గొన్నారు. అంతకుముందు ఆశ్రమ ఆవరణలో ఉన్న శివుడుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ మానసిక రుగ్మతలతో బాధపడుతున్న అభాగ్యులతో పాటు ఆనాథలకు అండగా నిలబడి చేరదిస్తున్న మాతృదేవోభవ అనాథశ్రమ సేవలను ఆయన కొనియాడారు.
నా వంతుగా వారికి సంపూర్ణ సహకారాలను అందిస్తానన్నారు.
సామాజిక సేవలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి సంస్థలకు చేయుతానందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆశ్రమంలో 135 మందికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం మల్లేష్, భరత్, శ్రీధర్, బాలు, ఆశ్రమం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు,