ఉత్తమ ఉపాధ్యాయులుగా కృష్ణవేణి కరస్పాండెంట్, ప్రిన్సిపల్ ఎంపిక 

ఉత్తమ ఉపాధ్యాయులుగా కృష్ణవేణి కరస్పాండెంట్, ప్రిన్సిపల్ ఎంపిక 

రామగిరి మండలం కల్వచర్ల గ్రామం లాంటి గ్రామీణ ప్రాంతం లో 2012 లో పాఠశాల స్థాపించి ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు మాములు ఫిజులతో కార్పోరేట్ విద్యను అందిస్తూ,ఎంతో  మంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూ,ప్రతి సంవత్సరం అత్యుత్తమ  ఫలితాలు సాధిస్తున్న పాఠశాల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి,ప్రధానోపాధ్యాయులు బర్ల శ్రీనివాస్ సేవలు గుర్తించి డైమండ్ అచీవ్మెంట్ అవార్డు, ఎక్షలెన్స్ అవార్డు కి ఎంపిక చేసినట్లు సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ కన్వీనర్ అరకాల రామచంద్ర రెడ్డి ప్రకటించారు.ఇట్టి అవార్డులను కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో పాఠశాల కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి,ప్రధానోపాధ్యాయులు బర్ల శ్రీనివాస్ ను అవార్డులతో సత్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టిఆర్ఎస్ఎంఎ అధ్యక్షులు అదర్ సండే.సమ్మా రావు,పాఠశాల డైరెక్టర్స్ శ్రీధర్ బాబు,అనిల్ కుమార్ రెడ్డి,రంజిత్ రెడ్డి మరియు ఉపాధ్యాయిని ఉపాద్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment