వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు
చార్మినార్ ఎక్స్ ప్రెస్
చందుర్తి ఆగస్టు 28:
చందుర్తి మండల కేంద్రంలో జోగాపూర్ గ్రామంలోని వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం కృష్ణాష్టమి వేడుకలు పాఠశాల కరస్పాండెంట్ రాజూరి సద్గుణ చారి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో అలరించారు. ఉట్టి కొట్టు కార్యక్రమాన్ని గోపికల అల్లరి మధ్య శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులు కొట్టారు. అనంతరం పిల్లల నృత్యాల, ఆటపాటలతో సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.