కేరళ వరద బాధితులకు అండగా నిలవాలి.

కేరళ వరద బాధితులకు అండగా నిలవాలి.

సిపిఐఎం ఆధ్వర్యంలో కేరళ వరద బాధితులకు సహాయాన్నిధి సేకరణ

భద్రాచలం:ప్రకృతి అందాలకు నిలుయమైన కేరళ రాష్ట్రం ఇటీవల వరదలతో అతలాకుతలమై ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది గూడు నీడ లేక నిర్వాసితులైన నేపథ్యంలో దేశంలోనే అత్యంత ఆహ్లాదకరమైన అందమైన పర్యటక ప్రదేశం గా పిలవబడే కేరళ రాష్ట్రాన్ని అక్కడ ఉన్న ప్రజలను ఆదుకొని అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం సిపిఐఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కేరళ సహాయ నిధిని వసూలు చేశారు. ఈ సందర్భంగా మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అండగా నిలబడే తత్వం భద్రాచలం ప్రజలకు ఉందని గతంలో కూడా అనేకసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడి ప్రజలకు భద్రాచలం ప్రజలు అండదండలుగా నిలిచారని మచ్చ గుర్తు చేశారు. ఊహించని ప్రకృతి వైపరీత్యంతో కేరళ రాష్ట్రం అనేకమంది ప్రాణాలను పోవటమే కాకుండా ఎంతో మంది ఆస్తులు కోల్పోయి నిర్వాసితులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. వరదలు వచ్చిన వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఆదుకునేందుకు సర్వశక్తులను వడ్డీ శ్రమిస్తుందని అక్కడి సామాన్య ప్రజల నుండి రాష్ట్ర మంత్రులు దాకా క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు కేరళ సహాయ నిధిని సేకరించి అ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామని ఇప్పటికే పట్టణంలోని భగవాన్ స్వీట్స్ అధినేత జిఎస్ శంకర్రావు లాంటి ఎంతోమంది ప్రముఖులు తమ విరాళాన్ని నేరుగా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారని అభినందించారు. పట్టణంలోని ప్రజలు కేరళ రాష్ట్రానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు సున్నం గంగా బండారు శరత్ బాబు ఎర్రం శెట్టి వెంకట రామారావు పారెల్లి సంతోష్ కుమార్ నాదెండ్ల లీలావతి పట్టణ నాయకులు నాగరాజు లక్ష్మణ్ భూపేందర్ కనక శ్రీ ఆది శ్రీను పోసి కాకా రమణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment