యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి,ఐటీడీఏ పీవో బి రాహుల్

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి,

గంజాయి రహిత సమాజంలో అందరూ భాగస్వాములు కండి.
ఐటీడీఏ పీవో బి రాహుల్

డి వై ఎఫ్ ఐ పోస్టర్ ఆవిష్కరణ

భద్రాచలం: దేశం వివిధ రంగాల్లో రాణించాలంటే యువత మేధస్సు, నైపుణ్యం అవసరం అని.దేశం ఔన్నత్యాన్ని నిలబెట్టగల శక్తి సామర్ధ్యాలు యువత సొంతఅని మార్పు రావాల్సింది యువతలో, మార్పు తేవాల్సింది కూడా యువతే అని దురదృష్టవశాత్తు నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో తేలియాడి జ్ఞానాన్ని, విచక్షణను, శక్తిసామర్ధ్యాలను కోల్పోయి నిర్వీర్యమై, నిస్తేజంగా మారుతున్నారనీ గంజాయి డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వినియోగం వలన యువశక్తి పెడదారిపడుతున్నదినీ అందుకు యువత వాటికి దూరంగా ఉండాలి అని ఐటీడీఏ పీవో బి రాహుల్ తెలిపారు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డి వై ఎఫ్ ఐ భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన డ్రగ్స్, గంజాయి రహిత అవగాహన స్టిక్కర్స్ ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యువతను మత్తులో ముంచి చిత్తు చేసే గంజాయి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేయాలి.” సకల అనర్ధాలకు అరాచకాలకు హత్యలకు ప్రేరణగా నిలిచే గంజాయి డ్రగ్స్ వాడకం వంటి మత్తు వ్యసనాలను దూరం చేయకుండా సమాజం బాగుపడదనీ .గంజాయి, డ్రగ్స్ మారుమూల గ్రామాలకు పట్టణాలకు వ్యాప్తి చెందడం అత్యంత ఆందోళన కలిగించే విషయమని తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, బడిపిల్లల నుండి వర్సిటీ స్టూడెంట్స్ దాకా రోజు కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ముఖ్యంగా సినీ ప్రముఖలు, వ్యాపారవేత్తలు ఈ మత్తు మహమ్మారికి బానిసలౌతున్నారు. గంజాయి కొనడానికి డబ్బుల్విలేదని కన్నవారినే కడతేర్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయనీ గంజాయి దొరకడం లేదని, గంజాయికి, డ్రగ్స్ కి బానిసలై మత్తు నుంచి బయటపడలేక ప్రాణాలు తీసుకుంటున్నారనీ మధ్యతరగతి ప్రజానీకమే లక్ష్యంగా పోలీసుల కన్నుగప్పి అంతరపంటగా గంజాయిని సాగుచేయడం దాన్ని యువతరానికి అలవాటు చేసి, ఆతర్వాత మత్తు పదార్థాలకు బానిసలను చేస్తున్నారనీ. పక్కా ప్లాన్ ప్రకారం యువకులకు, చిన్నారులకు ఈ మాదక ద్రవ్యాలను అలవాటు చేస్తున్నారనీ,అక్రమ రవాణా చేస్తున్నారనీ.భ్రమల్లో తేలియాడించి ఊహల పల్లకీలో ఊరేగించి, రంగుల ప్రపంచం చుట్టూ పరిభ్రమించేలా చేయగల శక్తి మాదక ద్రవ్యాలకుందనీ యువత నమ్ముతూన్నారాని ఈ డ్రగ్స్ అలవాటు పడిన వారికి మానవ ప్రపంచంతో సంబంధాలుండవనీ మంచి-చెడు విచక్షణ కనిపించదనీ. స్వప్నలోకాల్లో విహరిస్తూ, మత్తు వదలిన తర్వాత అనేక శారీరక, మానసిక బలహీనతలకు గురై, మళ్ళీ అదే మత్తుకోసం చేయకూడని అకృత్యాలన్నీ చేస్తారనీ ,డ్రగ్స్ మాఫియా వలలో చిక్కి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి, చట్టవిరుద్ధమైన డ్రగ్స్ రవాణాకు పాల్పడతారనీ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా, డ్రగ్స్ వినియోగం తగ్గడం లేదనీ. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తుంది అని ,యువత సైతం అదేవిధంగా అక్రమ రవాణాను అడ్డుకోవాలనీ ప్రజా-చైతన్య కార్యక్రమాలు చేపట్టాలనీ , తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, సమాజం అందరూ కలిసి కట్టుగా పోరు సాగిస్తే మాదక ద్రవ్యాలు మహమ్మారిని తరిమివేయడం సాధ్యం అవుతుందనీ. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సామాజిక సంఘాల వారు అందరికీ కౌన్సిలింగ్లు నిర్వహించాలనీ.విద్యా సంస్థల్లో అవగాహనా సదస్సులు నిర్వహించాలనీ. విద్యా సంస్థల దగ్గర ఉండే చిన్న చిన్న దుకాణదారులకు సైతం డ్రగ్స్, గంజాయి అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.బస్తీలల్లో, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి మత్తు తో అరాచక శక్తులుగా మారుతున్న ఈ పరిస్థితులు మారాలనీ ,ప్రజల్లో మార్పు రావాలనీ మత్తులో తూలుతున్న యువతను ఆ మత్తు నుండి బయటకు తీసుకురావాలనీ సకల అనర్ధాలకు, సమాజంలో చోటుచేసుకుంటున్న అరాచకాలకు, అమానుషత్వ ధోరణులకు “మత్తు” ప్రధాన కారణం అని అనేక సర్వేలు సూచిస్తున్నాయనీ. మానసిక ప్రవర్తనలో విపరీతమైన ధోరణులను ప్రేరేపించి,అరాచకత్వానికి నాంది పలుకుతున్న డ్రగ్స్ ను యువత నుండి దూరం చేయాలనీ ,డ్రగ్స్ లేని సమాజాన్ని రూపొందించడానికి మరింత కృషి చేయాలనీ డ్రగ్స్, గంజాయి నిర్మూలనకై, వివేకవంతమైన సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరూ నడుంబిగించాలనీ ఖండాంతరాలకు విస్తరించిన డ్రగ్స్ దందాను అరికట్టాలనీ ,నగరాలను దాటి, పల్లెల్లోకి ప్రవేశించిన గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని కూకటివ్రేళ్ళతో పెకిలించాలనీ. సమాజంలో ఈ రుగ్మతలను పారద్రోలేందుకు భారత ప్రజాతంత్ర యువజన డివైఎఫ్ఐ బాధ్యత తీసుకుని 30000 అవగాహన గోడ స్టిక్కెర్స్ ముద్రించి బాధ్యత తీసుకోవటం అభినందనీయం అని.మత్తులేని సమాజాన్ని నిర్మించే ఈకృషిలో డి వై ఎఫ్ ఐ మంచి పాత్ర పోషించాలి అని అందులో అందరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డి వై ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలరాజు,హరికృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు భూపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment