కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు ఒక వరం…
– మెదక్ పట్టణం తో పాటు మండలంలో 116 మందికి అందజేత
– మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
చార్మినార్ ఎక్స్ ప్రెస్ 20సెప్టెంబర్ మెదక్ జిల్లా ప్రతినిధి
కళ్యాణలక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరం అని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని ద్వారక గార్డెన్స్ లో మెదక్ పట్టణంతో పాటు మెదక్ మండలంకు సంబంధించి 116 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ప్రజలకు వరం అని ఆయన అన్నారు. నియోజక వర్గంలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చైర్మెన్ చంద్రపాల్, కౌన్సిలర్ దాయర లింగం, దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, బొద్దుల రుక్మిణి క్రిష్ణ, షమీ, లక్ష్మినారాయణ, ఆవారి శేఖర్, గోదల సాయిరాం, రాగి అశోక్, గూడూరి క్రిష్ణ, బొజ్జ పవన్, మేడి మధుసూదన్ రావు, ఎస్.డి. జ్యోతి క్రిష్ణ, దేవులా, రమేశ్, గూడూరి శంకర్, అశోక్, దశరథం, హపీజ్ మోల్సాబ్, నాగిరెడ్డి, శివరామక్రిష్ణ, పురం వెంకటనారాయణ, మనోజ్ కుమార్ లతో పాటు మెదక్ మండల ఎంఆర్ఓ లక్ష్మణ్ బాబు తదితరులు పాల్గోన్నారు.