వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి: కక్కిరేణి శ్రీనివాస్
44 వ వార్డు ప్రజలు సుఖ సంతోషాలతో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని వార్డ్ కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ సూచించారు. శనివారం విద్యానగర్లో వినాయక చవితి సందర్భంగాఏర్పాటుచేసిన వినాయక మండపాన్ని సందర్శించి వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుని ఆశీస్సులు వార్డు ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు వీరారెడ్డి, కమిటీ సభ్యులు శ్రీను, అశోక్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణంరాజు, శ్రీనివాస్, రమణ, యామ ప్రభాకర్, పిన్నెల్లి వెంకటేష్, రమేష్, తదితరులుపాల్గొన్నారు.