జిల్లా ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ డి.రవీంద్రశర్మ.
మహబూబాబాద్ జిల్లా(చార్మినార్ ఎక్స్ ప్రెస్):
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.రవీంద్రశర్మ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకెన్, అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందచేసి శుభాకంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సి.సురేష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పద్మాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, కోర్టు పరిపాలన అధికారి క్రాంతి కుమార్, తదితరులు ఉన్నారు.