జర్నలిస్ట్ సమ్మయ్య సేవలు మరువలేనివి.::-సమ్మయ్య కుటుంబ సభ్యులకు టియూడబ్ల్యూజే (టిజెఎఫ్) ఆర్థికసాయం.
-జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ.
-జర్నలిస్టు సమ్మయ్యకు ఘన నివాళి.
ఖమ్మం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
సీనియర్ జర్నలిస్ట్ వార్త ఖమ్మం కార్పొరేషన్ రిపోర్టర్ అబ్బుగాని సమ్మయ్య (48) సేవలు మరువలేనివని, ఆయన మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి లు పేర్కొన్నారు. అనారోగ్య సమస్యతో సమ్మయ్య అకాల మరణం బాధాకరం. విషయం తెలుసుకున్న యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో ముస్తఫా నగర్ లో ఉన్న సమ్మయ్య నివాస గృహానికి వెళ్లి సమ్మయ్య భౌతికకాయంపై పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సమ్మయ్య కుటుంబ సభ్యులకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సీనియర్ జర్నలిస్టుగా అందరికీ సమ్మయ్య సుపరిచితులని, అందరితో కలివిడిగా ఉంటూ మంచి పేరు సంపాదించిన సమ్మయ మృతి చెందడం బాధాకరమని కొనియాడారు.
యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అల్లం నారాయణ, మారుతి సాగర్ లు స్పందించి సమ్మయ్య కుటుంబానికి అండగా ఉండాలని ప్రభుత్వం పరంగా అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందించే విధంగా కృషి చేయాలని జిల్లా నాయకత్వాన్ని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కీ గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు టిఎస్ చక్రవర్తి, పిన్ని సత్యనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు యలమందల జగదీష్, నాయకులు వెంకటకృష్ణ, సాయి, రవీందర్, లక్ష్మణ్, డెస్క్ జర్నలిస్టులు ప్రసాద్, శివ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.