ఉద్యోగ అవకాశాలు ఈనెల 13 న 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా

ఉద్యోగ అవకాశాలు ఈనెల 13 న 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్

చార్మినార్ ఎక్స్ ప్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఆగస్టు6

భద్రాచలం:సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, భద్రాచలం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల పరిధిలో గల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం ఈనెల 13 న (20) కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ జాబ్ మేళాలో శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్, మోర్, అపోలో ఫార్మసీ, నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్, పేటియం, వరుణ్ మోటార్స్, జిఎంఆర్ కార్గో, ఎల్ఐసి ఇండియా, గ్లాండ్ ఫార్మా, కె ఎస్ టే కర్స్, స్విగ్గి, వంటి కంపెనీలలో ఉద్యోగ కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఆసక్తి గల నిరుద్యోగ గిరిజన యువత రేశ్యుమే, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు, జిరాక్స్ సర్టిఫికెట్లతో ఈనెల 13న ఉదయం 9:30 గంటలకు గిరిజన భవనం ఐటిడిఏ భద్రాచలం ప్రాంగణము నందు ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన కోరుతూ, అర్హత గల నిరుద్యోగ గిరిజన యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఇంకా పూర్తి సమాచారం కొరకు 81 43 84 0 9 0 6,6 3 02 6 0 8905 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment