గోవింద నామాలతో మారి మోగిన : రంగనాథ స్వామి ఆలయం జియాగూడ

గోవింద నామాలతో మారి మోగిన : రంగనాథ స్వామి ఆలయం జియాగూడ

 

 

సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు.

జియాగూడలో రంగనాథ స్వామి టెంపుల్ తిరుపతిలో జరిగే విధంగా చేస్తారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్వామివారికి పట్టు వస్త్రాలు ఇస్తారు. తిరుపతిలో తొక్కిస్తులాట దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అన్ని వెంకటేశ్వర్ల మందిరాల దగ్గర పోలీస్ భద్రత ఏర్పాటు చేసింది. 

 జియాగూడ రంగనాథ్ స్వామి దర్శించుకోవడానికి నగర నలుమూలల నుండి కొన్ని వేల మంది భక్తులు వచ్చినారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రంగనాధ్ స్వామి టెంపుల్ కమిటీ వారు పూర్తి ఏర్పాట్లు చేసినారు.

Join WhatsApp

Join Now

Leave a Comment