*శేరిలింగంపల్లి లో జయశంకర్ సార్ జయంతి*.
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ లో ఈరోజు తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబ గచ్చిబౌలి లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో ఈరోజు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాజి కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణా సాధించటానికి తెలంగాణా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు మన అందరికి ఆదర్శం అని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో పాటూ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలుపాల్గొన్నారు.