క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా మాజీ జెడ్పి చైర్మన్
క్రీడలు ఆరోగ్యం తోపాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని కొమురంభీం జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ మండలం చింతగూడలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి టోర్నమెంట్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సెలవులను వృథా చేయకుండా గ్రామాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.