బాలాజీ పేటలో ఓ వ్యక్తి ని పార్టీ నుండి సస్పెండ్ చెయ్యడం సరైనదే..
-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంబాల ముసులయ్య.
మండలంలో పార్టీకి వ్యతిరేకంగా వర్గాల పేరుతో పార్టీ విచ్చిన్నం చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంబాల ముసలయ్య ఒక ప్రకటనలో గురువారం తెలిపారు.ఈ సందర్భంగా మండలంలోని బాలాజీ పేట గ్రామంలో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ, అంటూ ఓ వ్యక్తి నాయకుడు లా చెలామణి అవుతూ,ఒంటెద్దు పోకడలు పోవడాన్ని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చెయ్యడాన్ని గుర్తించిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కోడి శ్రీనివాస్ బత్తిని రామ్మూర్తి ని పార్టీ నుండి బహిష్కరణ చేయడం సరైందే అని గ్రామ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని,రాబోయే రోజుల్లో పార్టీ ని విచ్చిన్నం చేసే వారి పట్ల ఇలాంటి నిర్ణయలే ఉంటాయని తెలిపారు.రాబోయే ఎన్నికలలో గత ఎన్నికలలో మాదిరిగా కలిసికట్టుగా ఏ విధంగా పనిచేశామో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు,నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.