రిక్రూట్మెంట్ చేయకుండా బదిలీలు చేయడం సమంజసం కాదు
ఇన్చార్జి వ్యవస్థలో పంచాయితీ పారిశుద్ధ్యనికి ప్రజా పరిపాలన సౌలభ్యానికి న్యాయం జరగదు
గ్రామపంచాయతీకి వెంటనే రెగ్యులర్ కార్యదర్శి నియమించాలి
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ భద్రాచలం డివిజన్ నాయకుడు కొండా చరణ్
చర్ల మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ముఖ్య కార్యకర్తలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ డివిజన్ నాయకుడు కొండాచరణ్ మాట్లాడుతూ చర్ల మండలంలోని అత్యంత పెద్దదైన మేజర్ చర్ల గ్రామపంచాయతీ కి రెగ్యులర్ కార్యదర్శి నియమించాలని అన్నారు గతంలో ఉన్న రెగ్యులర్ కార్యదర్శి ట్రాన్స్ఫర్ అవ్వడంతో నాటి నుంచి నెట్ వరకు చర్ల మేజర్ గ్రామపంచాయతీలో రెగ్యులర్ కార్యదర్శి నియమించలేదని తెలిపారు రిక్రూట్మెంట్లు జరపకుండా ట్రాన్స్ఫర్లు చేయడం సమంజసం కాదని ఇది ప్రజలకు అన్యాయం చేసినట్లే అవుతుందని తెలిపారు.రెగ్యులర్గా పంచాయతీలో ఉండి నిరంతరం పనిలో ఉన్నప్పటికీ మేజర్ గ్రామపంచాయతీలో గతంలో ఇంకా పని మిగిలి ఉండేదని తెలిపారుఇన్చార్జి వ్యవస్థలో పంచాయతీ పరిపాలన సాధ్యం కాదని తెలిపారు వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది పరిశుభ్రత లేకపోతే ప్రజలు అనారోగ్యాలు బారిన పడేటువంటి ప్రమాదం ఉంటుందని అన్నారు కచ్చితంగా పంచాయతీ ఇంచార్జి పరిపాలనలో పారిశుద్ధ్యనికి పరిపాలనకు న్యాయం జరగదని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో మల్టీపర్పస్ విధానం కారణంగా ఒక్క పంచాయతీలోని పనిని సంపూర్ణంగా చేయడం సాధ్యం కాదని తెలిపారు కాబట్టి ప్రజల అవసరాలను ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని కార్యదర్శులకు పడుతున్న అదనపు పని భారాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే మేజర్ గ్రామపంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శి నియమించాలని డిమాండ్ చేశారు లేనియెడల పార్టీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొండ కౌశిక్ చెన్నం మోహన్ ఎస్ కె మెహమాదా నాగమణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.