పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు మానుకోవాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
పాలస్తీనపై ఇజ్రాయిల్ దాడులు మానుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలస్తీ నా మీద ఇజ్రాయిల్ సాగిస్తున్న అరాచకాలకు భారత్ వంత పాడటం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ తో మిలటరీ సంబంధాలు విరమించుకోవాలని కోరారు. ఇంటర్నేషనల్ కోర్టు ఆదేశాల ప్రకారం మిలిటరీ సామాగ్రి ఎగుమతి లైసెన్స్ రద్దు చేయాలని కోరారు. ఆ దేశంలో అన్ని సైనిక ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా పాలస్తీనా పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల వల్ల అనేకమంది చిన్నపిల్లలు, రోగులు, ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలు పాలస్తీనా పై చేస్తున్న దాడులను ఖండిస్తున్న అమెరికా పోద్బలంతో ఇజ్రాయిల్ పాలస్తీనా పై దాడులు చేస్తుందన్నారు. భద్రత మండలి వెంటనే జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఆపాలని కోరారు. పాలస్తీనాలో శాంతిని నెలకొల్పాలని కోరారు. పాలస్తీ నకు ప్రతి ఒక్కరూ మద్దతు సంఘీభావం తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మట్టిపల్లిసైదులు,కోట గోపిజిల్లా కమిటీ సభ్యులు దండ వెంకటరెడ్డి, జిల్లపల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, పులుసు సత్యం, వీరబోయిన రవి, కొప్పుల రజిత, చిన్నపంగా నరసయ్య, నాయకులు వల్లపు దాసు సాయికుమార్, బానోతు వినోద్ నాయక్,షేక్ జహంగీర్, ములకలపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.