ప్రారంభమైన ఇంటి ఇంటి సర్వే

ప్రారంభమైన ఇంటి ఇంటి సర్వే

మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో తహిసిల్దార్ నరేష్ రెవెన్యూ సిబ్బంది, ఎన్యుమరేటర్లతో బుధవారం నాడు ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహిచమన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రారంభమైంది. ఈ రోజు నుంచి మూడు రోజులపాటు కుటుంబాలను గుర్తించే పనిలో సిబ్బంది ఉన్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో గుర్తించి స్టిక్కర్లు అతికిస్తున్నారు. ఈనెల 9న వివరాలు నమోదు చేస్తామని సమగ్ర కుటుంబ సర్వేలో ఏయే అంశాలు చెప్పాలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఫెరోజ్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment