చిల్లపల్లి లో వడ్ల కొనుగోలు కేంద్ర ప్రారంభం

చిలపల్లి లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం.

సీఎంఆర్ఎఫ్, రైతు బీమా చెక్కులను అందజేసిన
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి.

చార్మినార్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 29.
పెద్ద శంకరంపేట్. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు. పార్టీలకు రహితంగా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని ఆయా గ్రామాలకు తండాలకు సిసి రోడ్లు రహదారి నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయిని మధు. ఆర్ఎన్ సంతోష్ కుమార్.అలుగుల సత్యనారాయణ. నారా గౌడ్. దాచ సంగమేశ్వర్. జనార్ధన్ . పిఎసిఎస్ చైర్మన్ సంజీవరెడ్డి. పెరుమాండ్లు గౌడ్. తాసిల్దార్ గ్రేసీ బాయ్. ఆర్ఐ శరణప్ప. పిఎసిఎస్ సీఈఓ రవీందర్ ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment