సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్08*

శేరిలింగంపల్లి మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తూఉంది. తాజాగా ఆదివారం ఉదయమే శేరిలింగంపల్లి, మండలాల పరిధిలో విస్తరించి ఉన్న సున్నం చెరువులో కూల్చివేతలు చేపట్టారు. శేరిలింగంపల్లి, బాలానగర్ మండలాల పరిధిలో సున్నం చెరువు 26 ఎకరాలలో విస్తరించి ఉంటుంది అయితే ఈ చెరువు చాలాకాలంగా కబ్జాలకు గురవుతునే ఉంది 2013లో సర్వే నిర్వహించిన ఇరిగేషన్ అధికారులు ఈ చెరువులో 15ఎకరాల విస్తీర్ణంలో నీళ్లు ఉన్నాయని నిర్ధారించారు. 2013లో హెచ్‌ఎండీఏ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే సర్వే నంబర్‌ 13, సర్వే నంబర్‌ 14, సర్వే నంబర్‌ 16 ఉన్నట్లుగా నిర్ధారించింది. ఆ సర్వే నంబర్లలోనే బఫర్‌ జోన్లు ఉన్నాయనీ సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ను నిర్ధారిస్తూ 2014 మే 14న ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్ధారించిన ఎఫ్‌టీఎల్‌కు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. కొందరు కబ్జారాయుళ్లు దానిని ముందుకు జరపగా.. ఇంకొందరు ఫెన్సింగే లేకుండా చేసీ సర్వే నంబర్‌ 13, 14ల్లో చెరువు భూమి లేకుండా చేయగా, ప్రస్తుతం సర్వే నంబర్‌ 16పై కబ్జారాయుళ్ల కన్నుపడింది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ లేకుండా చేయడానికి గత పార్టీ నేతల సూచనల మేరకు ఇలా రోడ్డు నిర్మించారన్న ఆరోపణలూ ఉన్నాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాలానగర్‌ మండలం అల్లాపూర్‌ రెవెన్యూ పరిధిలోకి వచ్చే ఈ చెరువు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గుంట్లబేగంపేట రెవెన్యూ పరిధిలోనూ కొంత ఉంటుంది. రెండు జిల్లాల యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కబ్జాకు గురయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment