ప్రధానోపాధ్యాయుడిగా ఆయన సేవలు మరువలేనివి
హెచ్ఎం వీరభద్రం పదవి విరమణ సభలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సుజాతనగర్ మండల ప్రతినిధి సెప్టెంబర్ 1
సుజాతనగర్ ( ) హైస్కూల్ హెచ్ఎం చిట్లూరి వీరభద్రం పదవి విరమణ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు హెచ్ఎం వీరభద్రం ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు పిల్లల్లో సామాజిక చైతన్యం బోధన ద్వారా మాత్రమే తెలుస్తుందని ఉపాధ్యాయుల నిర్విరామ కృషికి వారి వద్ద నేర్చుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండడమే అందుకు ఉదాహరణ వీరభద్రం మాస్టారు అని కొనియాడారు. తన సర్వీసులో అందరి మన్ననలు పొందిన వ్యక్తి వీరభద్రం అని వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉన్నత విద్యా సేవ అంటే చిట్ట చివరి క్షణం వరకు తరగతి గదిలో బోధన చేయడమే ఆ విషయంలో ఆయన 100 శాతం విజయం సాధించారని కొనియాడారుఈకార్యక్రమంలో జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు ఎండి.కరీం పాషా యల్లంకి. చిననర్సింహారావు బొబ్బల.వెంకట్ రేగళ్ళ సాగర్ తదితరులు పాల్గొన్నారు.