హీటెక్కిన తూప్రాన్ రాజకీయం….
ఇంకా నాలుగు నెలలు ఉన్న పరస్పర రాజకీయ దాడులు
నిన్న మాజీ చైర్మన్ నేడు చైర్మన్ బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్…
నిన్న బిఆర్ఎస్ ధర్నాకు దీటుగా కాంగ్రెస్ ప్రెస్ మీట్
తూప్రాన్ పట్టణాన్ని భ్రష్టు పట్టించిన మాజీ చైర్మన్ అందుకనే ప్రజలు తిరస్కరించారు –తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ
చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో ఆగస్టు 28 ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది నిన్న బి ఆర్ ఎస్ నేడు కాంగ్రెస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పొంది రవీందర్ గౌడ్ పై ఫైర్ అయ్యారు మామిళ్ల జ్యోతి కృష్ణ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలు అనేక అవకతవకలకు పాలు పడ్డారని పేద ప్రజల రక్తం పీల్చుకొని తాగారని ఇలాంటి వ్యక్తిని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా ఒక మహిళకు అవకాశం కలిగించారని తూప్రాన్ కు పట్టిన శని వదిలింది కానీ రాజకీయంగా అభివృద్ధి చేస్తా ఉంటే ఓర్వజాలక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మునిసిపల్ చైర్మన్ హెచ్చరించారు కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ గత నాలుగేళ్లలో చేసింది ఏమీ లేదు కానీ ఆయన పదవి పోయి ఫ్రస్టేషన్లో ఉన్నాడని అందుకనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గత ప్రభుత్వ హయాంలోని తీర్మానాలు జీవోలు వచ్చాయని కొత్తగా ఏమీ తీర్మానాలు జరగలేదని మాజీ చైర్మన్ పదవి పోయిందని బెంగతో సోయి లేకుంటా మాట్లాడుతున్నారని కొని ఆడారు మున్సిపల్ కౌన్సిలర్ భగవాన్ రెడ్డి మాట్లాడుతూ గత టిఆర్ఎస్ పాలనలో చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పారిశ్రామిక టాక్స్ రూపంలోనే కాకుండా ప్రజలే యొక్క రక్తం పీల్చుకొని తాగారని పేద ప్రజలకు ఉసురు యొక్క తగలకుండా ఉండదని అందుకని కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో తూప్రాన్ వేగంగా అభివృద్ధి చెందుతుందని గత ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ తూప్రాన్ పట్టణాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నామని కొనియాడారు మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామిని గత మాజీ మంత్రి హరీష్ రావు ఒత్తిడి వల్ల కొన్ని తీర్మానాలకు ఒప్పుకోవాల్సి వచ్చిందని కానీ ప్రజలకు మేలు జరుగుతుందంటే చేసేవాళ్లం అంతేకానీ ఈ ప్రభుత్వంలో కొత్తగా జీవో వచ్చిందని లేనిపోని బురదలు జలుత్తే ఊరుకునేది లేదని మాజీ మున్సిపాలిటీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ పదవి పోయిందనే ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని ఒక మహిళా చైర్ పర్సన్ ఉన్నారని గౌరవం లేకుండా అఘోవ పరుస్తున్నారని ఒక కౌన్సిలర్ మీటింగ్ కూడా హాజరు కాకుండా తూప్రాన్ మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో ఇలా తెలుస్తుందని ప్రజలకు మంచి జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారని గత నాలుగు సంవత్సరాల లో చేయని పనులు నాలుగు నెలలు చేస్తున్నామని ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అధ్యక్షతన తూప్రాన్ పట్టణ అభివృద్ధికి కోటి యాభై లక్షలు మంజూరు చేసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో 25 కోట్లు పెండింగ్లో ఉన్నాయని అవి ఇంకా రిలీజ్ కాలేవు పెండింగ్ లోనే ఉన్నాయి కానీ మాజీ చైర్మన్ లేకుండా మాట్లాడుతున్నారని కొనియాడారు
మునిసిపల్ కమిషనర్ తో వాగ్వాదం….
గత 20 సంవత్సరాల నుంచి మాజీ చైర్మన్ శివ సాయి ఫంక్షన్ హాల్ కు ట్యాక్స్ కట్టకుండా ఎందుకు యాక్షన్ తీసుకోలేరు చెప్పాలని కమిషనర్ తో వాగ్వాదం చేశారు అలాగే అలాగే గత 20 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు టాక్స్ వసూలు చేయకపోతే సీజ్ చేయాలని మున్సిపల్ కమిషనర్ కురారు
మున్సిపల్ కమిషనర్ వివరణ…..
తూప్రాన్ మున్సిపల్ కమిషనర్ ఖాజా మైనుద్దీన్ గత పాలకుల పక్షాన జరిగిన అవకతవకలు సరిదిద్దుకుంటూ ఏదైతే మా దృష్టికి వచ్చినయో వాటి మీద చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చుకున్నారు
ఈ కార్యక్రమంలో తూప్రాన్ కౌన్సిలర్లు పల్లెల రవీందర్ గుప్తా రఘుపతి రవీందర్ రెడ్డి రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి దొర నాగరాజు గౌడ్ మైనార్టీ నాయకులు ఎండి ఉమర్ మాజీ ఎంపీటీసీ నర్సింలు బొల్లు నాగులు అనిల్ తదితరులు పాల్గొన్నారు