సాంస్కృతిక సారథి ఛైర్పర్సన్ వెన్నెలకు హార్దిక శుభాకాంక్షలు
జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్య రాజ్
చార్మినార్ ఎక్స్ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో నవంబర్ 16 ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గా తూప్రాన్ ముద్దు బిడ్డ గద్దర్ అన్న కూతురు వెన్నెల ను నియమించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారికి మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా బుడ్డ భాగ్య రాజ్ మాట్లాడుతూ ఉద్యమ గొంతుకలకు ఊతంగా నిలిచే ‘తెలంగాణ సాంస్కృతిక సారథి’కి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి వెన్నెల గద్దర్ గారి కూతురు గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి
నియమించిన సందర్భంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారికి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సిరెడ్డి గారికి స్థానిక మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ గారికి మరియు కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గద్దర్ తూప్రాన్ ప్రాంతం కావడంతో తూప్రాన్ మండల్ కు ఎంతో గర్వకారణమని, ఒక గుర్తింపు అని తూప్రాన్ మండల ప్రజలంతా ఆనందడోలికల్లో మునిగి తేలుతున్నారని అన్నారు. వెన్నెలకు చైర్మన్ పదవి రావడం చాలా సంతోషంగా ఉందని ఒక ప్రకటనలో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.