ఆందోల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆరోగ్యశాఖమంత్రీ దామోదర రాజా నరసింహా

చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా,26, నవంబర్

నియోజకవర్గంలోని 13 రోడ్ల అభివృద్ధికి ఇటీవల ప్రభుత్వం సుమారు ₹25.08 కోట్లు కేటాయించింది. ఇందులో కోడూరు నుంచి కొండారెడ్డిపల్లి వరకూ వేయనున్న 3 కిలోమీటర్ల రోడ్డు పనులకు కోడూరు వద్ద, మాసాన్‌పల్లి నుంచి డాకూర్ పీడబ్ల్యూ రోడ్డు వరకూ వేయనున్న 3.4 కిలోమీటర్ల రోడ్డుకు మాసాన్‌పల్లి వద్ద, రోళ్లపాడు నుంచి జడ్పీ రోడ్డు వరకూ 2 కిలోమీటర్ల రోడ్డు పనులకు రోళ్లపాడు వద్ద మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్ల అభివృద్ధితో ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుందన్నారు‌. వీలైనంత వేగంగా పనులను పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నాణ్యతలో రాజీపడొద్దని ఆదేశించారు.
ప్రజా ప్రభుత్వంలో విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. ఏడాదికాలంలో ఆందోళ్ నియోజకవర్గంలో సుమారు 600 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. నియోజకవర్గానికి కొత్తగా నర్సింగ్ కాలేజ్, 150 బెడ్ల హాస్పిటల్ తీసుకొచ్చామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ₹10 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తున్నామని, రుణమాఫి చేశామని, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, గ్యాస్ సిలిండర్ ₹500కు అందజేస్తున్నామని తెలిపారు. వడ్లకు క్వింటాకు ₹500 చొప్పున బోనస్ ఇచ్చి, రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. ఏడాది కాలంలోనే సుమారు 54 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

కోడూరు, రోళ్లపాడు, మాసాన్‌పల్లిలో జరిగిన కార్యక్రమాల్లో  పుల్కల్ మండల పార్టీ ప్రెసిడెంట్ దుర్గారెడ్డి, ఆందోళ్ మండల పార్టీ ప్రెసిడెంట్ శివరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్‌మోహన్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment