*గుండాల మండల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మృతి*
*చార్మినార్ ఎక్స్ ప్రెస్ గుండాల మండలం ప్రతినిధి ఆగస్టు 28*
యాదాద్రి భువనగిరి జిల్లా
గుండాలమోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఈరోజు యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.సౌమ్యుడు మృదు స్వభావి ఆత్మీయులు నిగర్వి మంచి మనిషి ఎంతోమందికి జనగాం ఏకశిలా బిఇడి కాలేజీలో సైకాలజీ బోధించిన గురువు ఈరోజు ఈ వార్త విని చాలా బాధపడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తూ,వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కల్పించాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాం. గుండాలలో మోడల్ స్కూల్ ప్రారంభించిన నాటి నేటి వరకు విద్యార్థుల క్రమశిక్షణలో విద్యార్థుల పట్ల ర్యాంకులు సాధించడంలో ఎంతో కృషి చేసి మండలంలో ప్రజా ప్రతినిధులతో విద్యా ల తల్లిదండ్రులతో కళాశాల ఉపాధ్యాయులతో మమేకమై పాఠశాల పేరు కోసం కృషి చేసిన వ్యక్తి అని మండల ప్రజలు కొనియాడుతున్నారు.