నేడు మనం చూస్తున్న భారతదేశం….
నేడు మనం చూస్తున్న అభివృద్ధి అనే పంటకు విత్తనాలు చెల్లి సస్యరక్షణ చేసిన (మహా రైతు) ఈ ఆర్థికవేత్తే….
పేదరికం, అధిక జనాభా, నిరక్షరాస్యత, నిరుద్యోగం తో దశా, దిశా కోల్పోయిన భారతావనికి తొంభై వ దశకంలో సంస్కరణల బాట పట్టించిన ధైర్యశాలి…
అప్పుల్లో ఉన్న దేశం ఖర్చులు వెళ్లక బంగారం గిరివి పెట్టుకొని ముందుకెళ్లే రోజులనుంచి అప్పులిచ్చే స్థాయికి తెచ్చిన ఆర్థికవేత్త….
ప్రపంచ ప్రఖ్యత ఆర్థికవేత్త ఆర్థిక మంత్రిగా ఒక మారు , ప్రధానిగా రెండు మార్లు దేశానికి అనిర్వచనీయమైన సేవలందించిన నిజమైన సేవకుడు….
నేడు యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాలు మన్మోహన్ చలువే. నయా భారత్ నిర్మాణానికి పునాది వేసిన ధీశాలి. మాటల మరాఠి…చేతల మనిషి మన్మోహన్ సింగ్
షేక్ మహబూబ్
చార్మినార్ ఎక్స్ ప్రెస్ స్టేట్ ఇంచార్జ్