ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

 

 చందుర్తి మండల కేంద్రంలోని నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం పాఠశాల కరెస్పాండెంట్ పత్తిపాక నాగరాజు ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు. హరిదాసు, గంగిరెద్దు, వెంకటేశ్వర స్వామి గోదాదేవి వివిధ రకాల వేషధారణలో విద్యార్థులు అలరించారు. సంక్రాంతి పండగ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు చందుర్తి మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment