ఘనంగా జర్నలిస్ట్ రాజేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

ఘనంగా జర్నలిస్ట్ రాజేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

బూర్గంపాడు మండల పరిధిలోని మీడియా వెల్ఫేర్ సొసైటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్టు సోము రాజేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులు సోము రాజేష్ రెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రత్యేక కేకను రాజేష్ రెడ్డి తో కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రావులపల్లి తిరుపతిరావు, వలదా సాలయ్య లు మాట్లాడుతూ బూర్గంపాడు మీడియా వెల్ఫేర్ సొసైటీ తమ జర్నలిస్టులకు అండగా ఉంటూ వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ప్రముఖ విలేఖరి రాజేష్ రెడ్డికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment