ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
అన్ని రకాల ధాన్యానికి ₹500 రూపాయల బోనస్ ఇవ్వాలి
-సిపిఎం గుండాల మండల కార్యదర్శి మద్దెపురం రాజు డిమాండ్
గుండాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి అన్ని రకాల ధాన్యానికి క్వింటాలుకు ₹500 రూపాయల బోనస్ ఇవ్వాలని సిపిఎం గుండాల మండల కార్యదర్శి మద్దెపురం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం గుండాలలో పత్రికా విలేకరులతో ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు.ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల తక్కువ రేటుకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ప్రతి గింజను కొనుగోలు చేయాలని అన్నారు.ఎన్నికల ముందు చెప్పిన విధంగా కనీస మద్దతు ధరతో పాటు క్వింటాలుకు ₹500 రూపాయలు బోనస్ ఇవ్వాలని అన్నారు.ప్రభుత్వం బోనస్ ఎగ్గొట్టడం కోసం సన్నరకం ధాన్యానికి మాత్రమే బోనస్ చెల్లిస్తామని చెప్పడంతో పాటు వడ్ల సైజును కొలిచి ప్రభుత్వం యొక్క నామ్స్ ప్రకారం ఉంటేనే బోనస్ చెల్లిస్తామని చెప్పడం అన్యాయం అన్నారు.మండలంలో 80% రైతులు దొడ్డు ధాన్యాన్ని పండిస్తారని మిగిలిన పది ఇరవై శాతం సన్న రకానికి కూడా బోనస్ ఎగ్గొట్టడం కోసమే ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు.అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీని వెంటనే చేయాలన్నారు.ఒక పంట సీజన్ అయిపోయినప్పటికీ రైతు భరోసా కింద నేటికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయలేదన్నారు.ప్రభత్వం చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా రైతులను మోసం చేస్తుందన్నారు.ధాన్యానికి సరిపడా కాంటాలు గన్ని బ్యాగులు ఏర్పాటు చేయాలని కొనుగోలు చేసిన ధాన్యానికి పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయించాలని కోరారు.