ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట
ఘనంగా జయశంకర్ జయంతి
వేడుకలు
లక్షెట్టిపేట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.కార్యక్రమంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జయశంకర్ తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన పాత్రను తెలంగాణ రాష్ట్ర సాధనకోసం చేసిన సేవలను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా.,తన్నీరు సురేష్ అద్యక్షత వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో ఆచార్య జయశంకర్ చిరస్మరనీయుడని పేర్కొన్నారు వారు తెలంగాణ కోసం చేసిన నిస్వార్థ సేవను కొనియాడారు.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మాహాత్మా సంతోష్,జాడి శంకరయ్య, తిరుపతి,చంద్రశేఖర్,నాగేశ్వర్,సల్లా శ్రీనివాస్,రాజ్ కుమార్,సంద్యారాణి, కవిత,సతీష్,మహేష్,బోధనేతర సిబ్బంది మల్లారెడ్డి,శ్రీనివాస్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.