గోపన్ పల్లీ లో 50 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సెప్టెంబర్ 20*

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి గ్రామం లో రూ.50 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి .కాలనీలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆదేశించారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రతి కాలనీ,బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని,ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్ని అన్నారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు.నాణ్యతా విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో సీసీ రోడ్డు పనులను పూర్తి చేయాలని కార్పొరేటర్ అధికారులను ఆదేశించారు.అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గోపనపల్లి గ్రామం వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్ పెక్టర్ లక్ష్మణ్, సీనియర్ నాయకులు శేఖర్,సురేష్,రంగస్వామి,మురుగ, రాజు,పల్లపు చంద్రమౌళి, ప్రసాద్, శ్రీను,స్థానిక నేతలు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version