అంతర్ జిల్లామేకల దొంగల ముఠా అరెస్ట్
–రూ. 4 లక్షల 71వెలు నగదు 9మేకలు స్వాధీనం.
చార్మినార్ ఎక్స్ ప్రెస్: సెప్టెంబర్ 3.
పెద్ద శంకరంపేట్:
తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాలలో మెదక్ సంగారెడ్డి కామారెడ్డి లో పెద్ద ఎత్తున మేకల దొంగతనానికి పాల్పడిన దొంగల ముఠా పెద్ద శంకరంపేట పోలీసులకు చిక్కింది. వరుస మేకల దొంగతనాలతో సంచలనం రేపిన దొంగలు పోలీసుల అదుపులో లక్షల రూపాయల నగదు వాహనాలతో పట్టుబడటం చర్చనీయాంశం అయింది. ఆయా జిల్లాలలో మేకల దొంగతనాలతో హడలెత్తించిన దొంగలను పెద్ద శంకరంపేట హైవేపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడటంతో అదుపులోకి తీసుకున్నారు. అల్లాదుర్గ్ సీఐ రేణుక పెద్ద శంకరంపేట ఎస్సై శంకర్ లు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితులు చిన్న కటికే ఖదీర్ పాషా (ముస్లాపూర్), ఎరుకల గోపాల (గడి పెద్దాపూర్), మహమ్మద్ సాహిద్ (సంగారెడ్డి), ఇప్ప మహేందర్ (ముస్లాపూర్) ఎరుకల అనిల్ ( గడి పెద్దాపూర్) మెల్ల అనిల్ కుమార్ (గడి పెద్దాపూర్) 11 మందితో కూడిన ఈ దొంగల ముఠాలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు వివిధ జిల్లాలలో మొత్తం 16 దొంగతనాలు చేసి 100కు పైగా మేకలను దొంగలించారని మేకలను అమ్మి వచ్చిన డబ్బులతో ఎవరికీ అనుమానం రాకుండా గొర్రెలను కొని తిరిగి వాటిని అమ్మి సొంతగా వాహనాలు కొనుక్కొని దొంగతనం చేయాలని ఉద్దేశంతో పోలీసులకు పట్టు పడకుండా తిరుగుతున్న క్రమంలో మంగళవారం పెద్ద శంకరంపేట పోలీసులకు హైవేపై విధులు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని తనిఖీలు నిర్వ హిస్తుండగా పట్టుబడ్డారు.11 మంది నిందితులలో ఆరు గురు పోలీసులకు చిక్కగా 5 గురు పరాధిలో ఉన్నట్లు వీరి నుండి 4.71 లక్షల నగదు తో పాటు 9 మేకలను స్వాధీనం చేసుకొని ఆరుగురిని మెదక్ కోర్టు ముందు హాజరు పరచడం జరిగిందన్నారు. పరారీలో ఉన్న2 ఐదు మంది నిందితుల కోసం వేట కొనసాగుతుందని దొంగతనానికి వాడిన రెండు వాహనాలను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగిందన్నారు. సిఐ రేణుక రెడ్డి, పెద్ద శంకరంపేట ఎస్సై శంకర్ , అల్లాదుర్గ్ ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.