గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ చర్యలు.
సి.సి కెమెరాల పర్యవేక్షణ లొ గణేష్ శోభయాత్ర.
:జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్.
-జిల్లా వ్యాప్తంగా 1706 గణేష్ విగ్రహాల ఏర్పాటు.
-ఇటీవల కురిసిన వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, చెరువులు.
-కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు పాటించాలి.
మహబూబాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
గణేశ్ నిమర్జనమునకు పకడ్బందీ చర్యలను చేపట్టామని, అందరూ ప్రశాంత నిమర్జనమునకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ కోరారు.
పోలీసు శాఖ సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమర్జనం పూర్తి అయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.
నిమర్జనం అంతయు ప్రశాంత వాతావరణం లో పూర్తి అయ్యేలా భద్రత పరమైన అన్ని చర్యలను చేపట్టామని, అవసరమైన ప్రాంతాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు,
స్థానిక గజ ఈతగాళ్లు ను నిమర్జన ప్రాంతములో అందుబాటులో ఉంచమని, శోభాయాత్ర వెళ్ళేమార్గం లో ఇతర శాఖ ల యొక్క సమన్వయము తో ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు.
నిమజ్జనం సందర్భంగా డీజే లు, సౌండ్ సిస్టంలు,బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని తెలిపారు.
ముఖ్యంగా యువకులు నిమజ్జనం సమయంలో సంయమనం పాటించాలని ఊర్లలోని పెద్దలు పిల్లలకు తెలియజేసి ఆదర్శంగా నిలవాలని తెలిపారు.
చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని తెలిపారు. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వినాయక నిమజ్జను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు.