*గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి*
*గుండాల మండల ప్రజలకు ఎస్ ఐ సైదులు విజ్ఞప్తి*
*మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం.*
*చార్మినార్ ఎక్స్ ప్రెస్ గుండాల మండల ప్రతినిధి ఆగస్టు 28*
సెప్టెంబర్ 7వ తేదీ నుండి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని గుండాల మండల ఎస్ఐ జి.సైదులు ప్రజలకు సూచించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ వారు సూచించిన అవకాశాలను పరిగణలోకి తీసుకొని గణేష్ ఉత్సవాలను ప్రజలందరూ సుఖశాంతులతోనే కార్యక్రమాలు జరిపి ఇతరులకు ఆసౌకర్యం లేకుండా సామరస్య భావనతో కలిసి మెలిసి జరుపుకోవాలని సూచించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ శాఖ నిర్దేశించిన సమయంలోనే లౌడ్ స్పీకర్లు వినియోగించాలని చెప్పారు. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం పెంచాలన్నారు. ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించి ఉత్సవాలు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. వివాదాస్పద ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని మండపాలు వద్ద నిర్మించే క్రమంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వద్దని సూచించారు. విగ్రహ మండపాల వద్ద ప్రతిరోజు కమిటీ సభ్యులలో ఎవరైనా ఒకరు తప్పనిసరిగా ఉండాలన్నారు.నిమజ్జనం రోజున గుర్తించిన మార్గాల ద్వారానే విగ్రహాలను తరలించాలన్నారు.