నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన గండూరి కృపాకర్

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన గండూరి కృపాకర్

సూర్యాపేట పట్టణములో గత 30సంవత్సరాల నుండి బొడ్రాయి బజార్, మెయిన్ రోడ్, అలంకార్ రోడ్డులో చాయ్ హోటల్ నడుపుతూన్న జెల్ల వెంకన్న మనవరాలు నాలుగున్నర నెలల పసికందు ఆయుశ్రీ తలకు శస్త్ర చికిత్స చేయవలసి రావడంతో ఆ కుటుంబం విద్యానగర్ లో ప్రముఖ నాయకులు గండూరి క్ర్రపాకర్ ను ఆర్దిక సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో తనవంతుగా 10,000/- లను జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి క్ర్రపాకర్ ఆర్దిక సహాయం చేశారు. ఈ సందర్భంగా గండూరి క్ర్రపాకర్ మాట్లాడుతూ చిన్నారి శస్త్రచికిత్స కు డబ్బు ఎక్కువగా అవసరం వున్నది కాబట్టి పలువురు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో పలువురు ప్రముఖులు, సహాయం పొందిన కుటుంబ సభ్యులు గండూరి క్ర్రపాకర్ కు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment