మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజపేయి 100వ. జయంతి వేడుకలు ఘనంగాn
మండల కేంద్రంలో బుధవారం భారత రత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి 100వ. జయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జయంతి వేడుకలను ప్రారంభించారు.
ముధోల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ మాట్లాడుతూ, అటల్ బిహారి వాజపేయి భారతదేశ అభివృద్ధికి చేసిన విశేష సేవలను స్మరించుకుంటూ, దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన నేతగా ఆయనను కొనియాడారు. ఆయన ఆలోచనలు, కృషి, నైతికత దేశ రాజకీయాల్లో అపూర్వమని తెలిపారు.వాజపేయి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ సర్డ, రవి పాండే, మండల అధ్యక్షులు యథలం చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు శివాజీ పటేల్, లక్ష్మణ్ రెడ్డి, దేవదాస్ పటేల్, మారుతి, ఏల్లప్పతో పాటు వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.