మాజీ జెడ్పిటిసి మృతదేహానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి హరీష్ రావు.
విజయరామరాజు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం.
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.
చార్మినార్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 14,
పెద్ద శంకరంపేట్ . మాజీ జెడ్పిటిసి విజయరామరాజు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని మల్కాపూర్ లో మాజీ జెడ్పిటిసి విజయరామరాజు మృతి చెందడంతో భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంత్యక్రియల్లో మాజీ మంత్రి పాల్గొని కుటుంబ సభ్యులకు ఓదార్చారు. పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. విజయరామరాజు ఉద్యమ సమయం నుంచి టిఆర్ఎస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి వెంటే ఉన్నారని ఆయన పార్టీకి ఎనలేనిసేవలు అందించారని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు .వారు మన నుంచి దూరమయ్యారంటే చాలా బాధగా ఉందని తెలిపారు. అంత్యక్రియల్లో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. పేట మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ,మాజీ జెడ్పిటిసి విజయరామరాజు పాడెను మోసారు. అంత్యక్రియల్లో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీలు షేర్ సుభాష్ రెడ్డి. యాదవ రెడ్డి.మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి. పద్మ దేవేందర్ రెడ్డి. టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ . శివకుమార్. డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి. మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్. మురళి పంతులు. పేట మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ. మండల బిజెపి అధ్యక్షుడు కోణం విఠల్. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయిని మధు.నారా గౌడ్. ఆర్యన్ సంతోష్ కుమార్. దాచాసంగమేశ్వర్. ఆయా గ్రామాల మాజీసర్పంచ్ లు. ఎంపీటీసీలు. అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.