అంగన్ వాడీ భవన నిర్మాణంకు…
నిధులను మంజూరు చేయిస్తా…
– అంగన్ వాడీల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తా
– నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
అంగన్ వాడీల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని… అంగన్ వాడీ పక్కా భవన నిర్మాణం కొరకు నిధులను త్వరలోనే మంజూరు చేయిస్తానని నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ హామినిచ్చారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే కు అంగన్ వాడీలు వారివారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు. అంగన్ వాడీల సమస్యలపై ఎమ్మెల్యే స్పందించి సత్వరమే పరిష్కరిస్తానని పేర్కోన్నారు.