ఫాతిమా షేక్ సేవలు మరువలేనివి
కాగజ్ నగర్ పట్టణంలోనీ భారాస నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన నివాసంలో ఫాతిమా షేక్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయనే మాట్లాడుతూ మేడమ్ ఫాతిమా షేక్ సామాజిక సేవలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆమె జ్యోతీరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే నివాసంలో ఉండి, దళిత పిల్లలకు విద్య అందించడానికి కృషి చేశారు. ఫూలే దంపతులతో కలిసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఫూలే దంపతులు స్థాపించిన ఐదు పాఠశాలల్లో పనిచేశారు అని ఆమే సేవలను గుర్తు చేసుకున్నారు.