రెండులక్షల లోపు రుణాలు తీసుకొని రేషన్ కార్డు లేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి
*చార్మినార్ ఎక్స్ ప్రెస్ గుండాల మండల ప్రతినిధి ఆగస్టు 28*
గుండాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రెండు లక్షల లోపు రుణాలు తీసుకొని రేషన్ కార్డు లేక మాఫీ కానీ రైతులు తమ వ్యవసాయ శాఖ అధికారుల వద్ద రైతు వివరాలు నమోదు చేసుకోవాలని ఆలేరు సహాయ వ్యవసాయ సంచారకులు డి పద్మావతి గుండాల మండల ప్రత్యేక అధికారి ఎస్ సుజాత లు అన్నారు గుండాల రైతు వేదికలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం పాల్గొని మాట్లాడుతూ నేటి నుండి వచ్చేనెల తొమ్మిదో తారీఖు వరకు రైతులు తమ వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు.