బ్యాంకులో బ్రోకర్లు దోపిడీ ఖాళీ ఓచర్లపై రైతుల సంతకాలు
ప్రభుత్వం మంచి ఉద్దేశంతో రైతులకు రుణమాఫీ చేసిన రైతులకు మాత్రం మాఫీ అయిన డబ్బులు మొత్తం అందడం లేదు బ్యాంకులో బ్రోకర్లను పెట్టుకొని బ్యాంకు అధికారులు బ్రోకర్లు కుమ్మకై రైతుల నుండి అందిన కాడికి దోచుకుంటున్న సంఘటన
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎస్బిఐ బ్యాంకు లో రుణమాఫీ కోసం వచ్చిన రైతుల నుండి అందిన కాడికి దూసుకుంటున్న బ్యాంకు అధికారులు బ్రోకర్లు రైతు వద్ద కాళీ ఓచర్ల పైన సిగ్నేచర్ తీసుకొని డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము వెళ్లిపోండి అని అంటున్న అధికారులు రైతు నిజాయితీగా ఫామ్ ని తీసుకొని వస్తే అతని వద్ద ఫామ్స్ తీసుకోవడం లేదు బ్రోకర్ తో గాని తీసుకొని ఒక్కొక్క రైతు వద్ద పది నుంచి 20వేల వరకు దోపిడీ చేస్తున్న బ్యాంకు అధికారులు ఒకరి పేరు నుండి మాఫీ జరిగితే ఇంకొక డబ్బులు ఇచ్చిన సంఘటన కూడా ఎస్బిఐలో చోటు చేసుకుంటుంది ఎలాగైనా ప్రభుత్వం మాఫీ చేసిందని ఉద్దేశంతో రైతులు బ్యాంకు అధికారులు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని తీసుకొని తిరిగి వెళుతున్నారు రైతు ఏమైనా గట్టిగా మాట్లాడితే నీది పాత బకాయి ఉంది రెండు నెలల తర్వాత బ్యాంకుకు రావాలని ఆ రైతును పంపిస్తున్నారు మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చిన డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు నారాయణ నియోజకవర్గం లో ఊరికి ఒక్క బ్రోకర్ ను పెట్టుకొని బ్యాంకు అధికారులు రైతు బ్యాంకుకు వచ్చి ఫీల్ ఆఫీసర్ను లోన్ కడతానని అడిగిన మీ ఊళ్లో ఉన్న బ్రోకర్ ను సంప్రదించండి అని ఫీల్డ్ ఆఫీసరే రైతులకు సలహా ఇస్తున్నారు ఒకప్పుడు బ్రోకర్లు అంటే ఆర్టీవో ఆఫీస్ వద్దనే ఉండేవారు కానీ ఇప్పుడు నారాయణఖేడ్ లో ప్రతి బ్యాంకులో 10 నుండి 20 మంది బ్రోకర్లు ఉంటున్నారు రైతు బ్యాంకుకు వచ్చి లోన్ కడుదాం అన్న ముందు బ్రోకర్ని సంప్రదించమని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు అసలు రైతుకు ఫీల్డ్ ఆఫీసర్ ఎవరో మేనేజర్ ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది లోను కట్టిన తీసుకున్న బ్రోకర్ తోనే నడుస్తున్న బ్యాంకులు ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ దీనిపై సరైన నిగా పెట్టి ప్రభుత్వం నుండి రుణమాఫీ అయిన రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రైతులు కోరుకుంటున్నారు