రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి..
పెద్ద శంకరంపేట్… గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు.. శుక్రవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని శివాయపల్లి. విరోజిపల్లి.. బూరుగుపల్లి జమ్మికుంట గ్రామాలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని రైతులు విక్రయించాలని సూచించారు.. పెద్ద శంకరంపేట లోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని పరిశీలించి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ గ్రేసీ బాయ్ ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా.. ఆర్ ఐ శరణప్ప. ఐకెపి ఎపిఎం గోపాల్.. కాంగ్రెస్ పార్టీ నాయకులు నారా గౌడ్ దాచ సంగమేశ్వర్ . ఆర్ ఎన్ సంతోష్ కుమార్.. కుంట్ల రాములు.. పెరుమాండ్ల గౌడ్.. మహిళ సమాఖ్య బాధ్యులు తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment