పేద విద్యార్థికి అండగా ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్
ఏటూరునాగారం మండలం, బూటారాం గ్రామం కు చెందినా పెద ఆదివాసీ విద్యార్ధి సాత్విక ఉన్నత చదువులకై ఫీజు కట్టడానికి ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు సయ్యద్ వహీద్ దాతల ద్వారా 12,000/- సేకరించి, అ నగదును బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు గండుపల్లి సత్యం చేతుల మీదుగా అందించటం జరిగింది. పేదరికం చదువు కు అడ్డం కాదు అని, గొప్ప పట్టులతో చదివి ఉన్నత శిఖరము చేరాలని, ములుగు జిల్లా పేరు నిలబెట్టాలని, భవిష్యత్ లో పేదలకు అండగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమం లో బ్లడ్ డోనర్స్ సయ్యద్ వహీద్, గండుపల్లి సుకేష్, గడ్డం మహేష్ గౌడ్, ఇర్సవడ్ల లష్మినారాయణ, ఇట్టల నగేష్, మహమ్మద్ మున్నా, సయ్యద్ ఆఫీఫా రెహమాన్ పాల్గొన్నారు.