గుడుంబా స్థావరాలపై ఈస్గాం పోలీసుల దాడులు
కాగజ్ నగర్ మండలంలో ఈస్గాం పోలీస్ స్టేషన్ పరిధిలోని విలేజ్ నెంబర్ 5 గ్రామ శివారులో గుడుంబా తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో తుంగమడుగు గ్రామానికి చెందిన మహేష్ అను వ్యక్తి గుడుంబా తయారు చేస్తూ పట్టుబడ్డాడు. 150 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, అలాగే 5 లీటర్ల గుడుంబాను స్వాధీన పరుచుకుని అతనిపై కేసు చేసినట్లు ఇస్లాం ఎస్ఐ మహేందర్ వెల్లడించారు.