సహకార సంఘాల బలోపేతంతో ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు

సహకార సంఘాల బలోపేతంతో ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చు

*జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్ జిల్లా

 కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సహకార అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సహకార సంఘాల బలోపేతం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని, ప్రభుత్వం సహకార సంఘాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ మల్టీ పర్పస్ కోపరేటివ్ సొసైటీ ల ద్వారా క్షేత్రస్థాయిలో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మధ్య పరిశ్రమ, గీతా పరిశ్రమ, స్వయం సహాయక సంఘాల అభివృద్ధి, జన్ ఔషధం వేరు హౌస్, పాల శీతల కేంద్రాలు, బీసీ కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్ల, సొసైటీల ద్వారా జరిగే పథకాల అమలు తోపాటు మరింత వ్యాపార అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తూ సంఘాలను చైతన్య పరుస్తుందని అన్నారు, 

జిల్లాలో కామన్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు, 

సహకార సంఘాల అభివృద్ధి కోసం జాయింట్ వర్కింగ్ కమిటీ వేసి సంబంధిత అధికారులను సభ్యులుగా చేర్చి పూర్తిస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు, 

సంబంధిత శాఖల అధికారులు వారి ఆధ్వర్యంలో నిర్వహించే సొసైటీలు కార్యక్రమాలను విస్తృతపరిచి సంఘాలను బలోపేతం చేయాలని ఆదేశించారు, 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో,(రెవెన్యూ) కే.వీరబ్రహ్మచారి,

*డిసిడిసి కన్వీనర్, డిసిఓ ఎన్.వెంకటేశ్వర్లు, డిఏఓ విజయనిర్మల, జడ్పీ సీఈవో పురుషోత్తం, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, డివిహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, ఎక్సైజ్ శాఖ అధికారి కిరణ్, డిసిబిబి రజిత, విజయ డైరీ ప్రతినిధి,తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment