పెద్ద శంకరంపేటలో మాజీ సర్పంచ్ల ముందస్తు అరెస్టు..
చార్మినార్ ఎక్స్ ప్రెస్:ఆగస్టు 2 ,పెద్ద శంకరంపేట్.
ఇటీవలే పదవీకాలం పూర్తి చేసుకున్న మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు జీతాలు చెల్లించాలంటూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న మాజీ ప్రజా ప్రతినిధులను పెద్ద శంకరంపేట ఎస్ఐ శంకర్, పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మాజీ సర్పంచ్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు అప్పులు చేసి మరి పనులు చేస్తే ఇప్పటికి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం పరిష్కరించి బిల్లును మంజూరయ్యేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి నీ నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డిని కోరారు. పెండింగ్లో ఉన్న మాజీ సర్పంచ్ జీతాలను కూడా చెల్లించాలని తెలిపారు. రాష్ట్ర సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మమ్మల్ని అక్రమ అరెస్టు చేయడం సమంజసం కాదని పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు మాజీ సర్పంచ్ లు శంకర్ గౌడ్. విటల్ గౌడ్. ప్రకాష్. సాయమ్మ. వివిధ గ్రామాల సర్పంచులు ఉన్నారు.