ఆల్ఫోర్స్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు

ఆల్ఫోర్స్ లో ముందస్తు బతుకమ్మ సంబరాలు 

 తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలను నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్ ఆల్ఫోర్స్ పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి సుందరంగా ముస్తాబయి, వివిధ రకాల పూలతో అందంగా పేర్చి తయారుచేసిన బతుకమ్మలను తీసుకువచ్చి, ఒక చోటికి చేర్చి, బతుకమ్మ పాటలకు అనుగుణంగా చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావితరాల విద్యార్థులు సైతం కొనసాగే విధంగా బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థులు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment